నాలోని నువ్వు నీలోని నేను (నీదీ నాదీ ఒకే కథ - 2018)

(Naaloni nuvvu neeloni nenu song from Needi Naadi Oke Katha)





నాలోని నువ్వు నీలోని నేను
నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము

ఊగే ఈ గాలి పూసే ఆ తోట
మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము

ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు
నిన్ను నన్ను కలిపెటి నీలాల సిరులు
ఆ చేదు కాలం మారింది నేడు
చెరసాల బాధ పోతుంది చూడు

పొడిసే పొద్దు ఎగసే ఆనందం
శాశ్వత హోమం కాదిక నా దేహం
చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి
పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు

నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనము కానులైనము

హా హా హా హా హా హా హా

నీటిలో ఈదే చేపకు ఎపుడైనా
దాహం వేస్తుందా తెలుసా నీకైనా
నింగిలే ఎగిరే కొంగకు ఎపుడైనా
మలినం అంటేన తెలుసా నీకైనా
లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా
శోకం ఎంతున్నా కాలం ఆగేనా
ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా

పలికే ఆ చిలుక నవ్వే నెలవంక
ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక
ఏలే భువనాన గెలిచిన జత మాది
మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా

నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనము కానులైనము.


(అయిపోయింది)


Needi Naadi Oke Katha Movie Songs, Naaloni Nuvvu Neeloni Nenu Lyrical Video Song on Mango Music.
#NeediNaadiOkeKatha 2018 Latest Telugu Movie ft. Sree Vishnu / Sri Vishnu, Satna Titus of Bichagadu fame, Devi Prasad & others. #NNOK movie is presented by Nara Rohit, Music by Suresh Bobbili, written & directed by Venu Udugula and produced by Prashanthi & Krishna Vijay under Aran Media Works banner. #SreeVishnu #SatnaTitus #NeediNaadiOkeKatha #ARANMediaWorks #NaaloniNuvvuNeeloniNenu #SriVishnu #NaraRohit #SureshBobbili #AranMedia #NaaloniNuvvuNeeloniNenuSong Needi Naadi Oke Katha audio exclusively on Mango Music : http://www.youtube.com/mangomusic Song Details: Song: Naaloni Nuvvu Neeloni Nenu Singers: Sony, Naani Lyrics: Srinivas Jilakara Music: Suresh Bobbili Shehnai: Balesh Programming: Balu & Melody adding Nithin Violin: Sandaliya Mixing: Suresh Bobili Mastering: Vinay Flute: Pramodh

Comments

Popular posts from this blog